IPL 2025 : సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు ఉతికేస్తున్నారు. బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న మిచెల్ మార్ష్(41 నాటౌట్) అర్ధ శతకానికి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో ఎడెన్ మర్క్రమ్(26 నాటౌట్) సైతం 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో చెలరేగాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని పోరులో టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే కమిన్స్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన మిచెల్ మార్ష్(41 నాటౌట్), నాలుగో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. 4వ ఓవర్లో మార్ష్ బౌండరీ కొట్టగా.. మర్క్రమ్(26 నాటౌట్) వరసగా 6, 4తో 17 పరుగులు పిండుకున్నాడు.
No respite for the #SRH bowlers 😮
A breathtaking powerplay from Mitchell Marsh and Aiden Markram 👏#LSG 69/0 after 6 overs.
Updates ▶ https://t.co/GNnZh90u7T#TATAIPL | #LSGvSRH | @LucknowIPL pic.twitter.com/YdNjkkjBFc
— IndianPremierLeague (@IPL) May 19, 2025
అనంతరం హర్షల్ పటేల్‌కు చుక్కలు చూపిన మార్ష్ సిక్సర్‌తో స్కోర్ 50 దాటించాడు. ఇషాన్ మలింగ వేసిన ఆరో ఓవర్లో మర్క్రమ్ ఫోర్ కొట్టగా లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేయగలిగింది. ఈ జోడీ ఇంకో నాలుగైదు ఓవర్లపాటు ఇదే తరహాలో చెలరేగితే ఆరెంజ్ ఆర్మీ బౌలర్లకు కష్టకాలమే.