Yuki Bhambri | మరాకెచ్(మొరాకో): మారకెచ్ ఓపెన్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ యుకీ భాంబ్రీ పోరా టం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భాం బ్రీ, అల్బనో ఒలివెటి (ఫ్రాన్స్) జోడీ 5-7, 6-3, 7-10తో రెండో సీడ్ లుకాస్ మీడ్లెర్, అలెగ్జాండర్ ఎర్లెర్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే ఏటీపీ హోస్టన్ ఓపెన్ సెమీస్లో శ్రీరామ్ బాలాజీ, అండ్రీ జోడీ 7-6(5), 2-6, 3-10తోమ్యాక్స్ పుర్సెల్, జోర్డాన్ జంట చేతిలో ఓడి వైదొలిగింది.