Marnus Labuschagne : ప్రపంచ కప్ చివరి డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబూషేన్(Marnus Labuschagne) ఫీల్డింగ్ ఐకాన్, దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్(Jonty Rhodes)ను తలపించాడు. అద్భుత ఫీల్డింగ్‌తో రెండు రనౌట్స్ చేశాడు. మొదట కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటో(45)ను.. ఆతర్వాత దంచికొడుతున్న మహ్మదుల్లా(32)ను రనౌట్ చేశాడు. ఇద్దరు కీలక బ్యాటర్లను పెవలియన్ పంపిన లబూషేన్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సియాన్ అబాట్ వేసిన 28వ ఓవర్ ఐదో బంతికి శాంటో సింగిల్ తీయాలనుకున్నాడు. కానీ, బంతిని అందుకున్న లబూషేన్ డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేశాడు. హేజిల్‌వుడ్ వేసిన 36వ ఓవర్లో తౌహిక్ హృదయ్(74) కవర్స్ వైపు ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు.
నాన్‌స్ట్రయికర్ మహ్మదుల్లా రన్ తీస్తుండగానే లబూషేన్ ఒంటిచేత్తో బంతిని ఆపి నేరుగా వికెట్లకు గురి చూసి కొట్టాడు. అంతే.. మహ్మదుల్లా నిరాశగా వెనుదిరాగాడు. మైదానంలో లబూషేన్ అంత చురుకుగా కదలడం చూసి కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్(Ricky Ponting) సైతం ఆశ్చర్యపోయాడు.
పుణేలో టాస్ గెలిచిన కమిన్స్ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. యంగ్‌స్టర్ తౌహిక్ హృదయ్(74) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటో(45), మహ్మదుల్లా(32) ఫర్వాలేదనిపించారు. చివర్లో మెహిదీ హసన్ మిరాజ్(29) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో బంగ్లా 8 వికెట్ల నష్టానికి 306 రన్స్ కొట్టింది. ఆసీస్ బౌలర్లలో సియాన్ అబాట్, ఆడం జంపా తలా రెండేసి వికెట్లు తీశారు.