Bazzball : అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు బాజ్‌బాల్(Bazzball) ఆటతో పెద్ద సంచలనమే సృష్టించిందనుకోండి. బెన్ స్టోక్స్ సేన తమ దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్ స్వరూపాన్నే మార్చేయడం చూశాం. తాజాగా ఈ పదానికి విశేష గుర్తింపు లభించింది. కొలిన్స్ ఇంగ్లీష్ డిక్షనరీ(collins english dictionary)లో బాజ్‌బాల్ పదానికి చోటు దక్కింది. అయితే.. దీనిపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్(Marnus Labuschagne) అదొక చెత్త ఐడియా అంటూ కౌంటర్ వేశాడు.
‘నిజంగా చెప్తున్నా.. బాజ్‌బాల్ అంటే ఏంటో నాకు తెలియదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు’ అని మీడియాతో లబూషేన్ అన్నాడు. ఈ స్టార్ బ్యాటర్ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శులు గుప్పిస్తున్నారు. ‘లబూషేన్‌కు బాజ్బాల్ను డిక్షనరీలో చేర్చడం నచ్చకపోవచ్చు లేదంటే అతడు ఇంతకుముందు డిక్షనరీ అనే మాట విని ఉండకపోవచ్చు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘Bazball’ in the dictionary? 📖🤔
#CWC23 pic.twitter.com/tlAdju5qVn
— cricket.com.au (@cricketcomau) November 1, 2023
నిరుడు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ హెడ్‌కోచ్‌గా, బెన్ స్టోక్స్ టెస్టు సారథిగా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లీష్ జట్టు ఆటే మారిపోయింది. స్టోక్స్ సేన టెస్టుల్లోనూ వన్డే తరహా ఆడడం మొదలెట్టింది. కానీ, బాజ్‌బాల్ అనేది ఇంగ్లండ్ పిచ్‌ల వరకే పరిమితం అయింది. అవును.. బాజ్‌బాల్ ఆటను నమ్ముకున్న బట్లర్ సేన.. వన్డే వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో నిలవడమే అందుకు నిదర్శనం.