సిడ్నీ: ఆదివారం నుంచి ఆస్ట్రేలియా(Australia), భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నది. ఆసీస్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ గాయపడ్డాడు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌ను తీసుకున్నారు. తొలుత ప్రకటించిన వన్డే జట్టులో లబుషేన్‌కు చోటు దక్క లేదు. కానీ ప్రస్తుతం లబుషేన్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయిదు ఇన్నింగ్స్‌లో అతను నాలుగు సెంచరీలు చేశాడు. 50 ఓవర్స్ మ్యాచుల్లో అతను రెండు సెంచరీలు చేయడం గమనార్హం.
గ్రీన్‌కు స్వల్ప స్థాయిలో గాయమైనట్లు ఎక్స్ రే ద్వారా తేల్చారు. కానీ యాషెస్ సిరీస్ రాబోతున్న నేపథ్యంలో అతనికి రెస్టు ఇచ్చేందుకు ఆసీస్ మేనేజ్మెంట్ సిద్దపడింది. భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కెమరూన్ గ్రీన్‌ను పక్కనపెట్టేశామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కొన్ని రోజుల పాటు గ్రీన్ రెస్టు తీసుకోనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది.
Marnus Labushagne has been rewarded for his strong domestic form, but an Aussie star is set to miss the #AUSvIND series: https://t.co/AkmfSSiMHY pic.twitter.com/c2O7j0dMsL
— cricket.com.au (@cricketcomau) October 17, 2025