గౌహతి: ఏడెన్ మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాట్ హెడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మూడోవ స్లిప్ స్థానంలో ఉన్న మార్క్రమ్.. తన కుడి వైపు పరుగు తీస్తూ ఆ బంతిని డైవ్ చేసి అందుకున్నాడు. స్టన్నింగ్ రీతిలో అతను ఆ క్యాచ్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు(INDvSA)లో టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో క్రమంగా వికెట్లను కోల్పోతున్నది. ఫాలోఆన్ ఆడే ప్రమాదంలో టీమిండియా ఉన్నది. తాజా సమాచారం ప్రకారం ఇండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది.
What a CATCH by Aiden Markram! Unbelievable! pic.twitter.com/yz6S7mOTNU
— Soham Ghosh (@Rickcy7) November 24, 2025
ఇవాళ ఉదయం ఇండియన్ బ్యాటర్లలో జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. అతను 58 రన్స్ చేసి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ 22, సాయి సుదర్శన్ 15, పంత్ 7, జడేజా 6, నితీశ్ రెడ్డి 10 రన్స్ చేసి ఔటయ్యారు. ద్రువ్ జురెల్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ క్రీజ్లో ఉన్నారు.