IPL 2025 : ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతోంది. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీశారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర(37)ను ఎల్బీగా ఔట్ చేసిన మర్క్రమ్ లక్నో పెద్ద బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే రాహుల్ త్రిపాఠి(9)ని రవి బిష్ణోయ్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. అంతే.. చూస్తుండగానే 3 కీలక వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే(2), రవీంద్ర జడేజా(4) ఆడుతున్నారు. 10 ఓవర్లకు చెన్నై 3 వికెట్ల నష్టానికి 81 రన్స్ చేసింది.
లక్నో నిర్దేశించిన 167 పరుగుల ఛేదనలో ఓపెనర్లు షేక్ రషీద్(27), రచిన్ రవీంద్ర(37) లు దూకుడుగా ఆడారు. శార్ధూల్ వేసిన తొలి ఓవర్లో రవీంద్ర రెండు ఫోర్లు బాదాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో రషీద్ మూడు ఫోర్లు కొట్టాడు. అనంతరం శార్థూల్‌ను ఉతికేసిన ఇద్దరు మూడు బౌండరీలు సాధించారు. ఐదో ఓవర్లో రషీద్‌ను అవేశ్ ఖాన్ ఔట్ చేసి తొలి వికెట్ అందించాడు.
𝙘&𝙗 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 😎
That’s a smart catch by Ravi Bishnoi 👌#LSG have the visitors 3⃣ down for 8⃣1⃣ after 10 overs.
Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK pic.twitter.com/7f3qOKu6u3
— IndianPremierLeague (@IPL) April 14, 2025
అతడు ఔటయ్యాక వచ్చిన రాహుల్ త్రిపాఠి(9) ధనాధన్ ఆడే ప్రయత్నం చేశాడు.. 5 పరగులు వద్ద అబ్దుల్ సమద్ క్యాచ్ జారవిడవగా అతడికి లైఫ్ లభించింది. కానీ, అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, సీఎస్కే 76 వద్ద మూడో వికెట్ కోల్పోయింది.