న్యూఢిల్లీ: ఒలింపిక్స్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్, చెస్ వరల్డ్ చాంపియన్ డీ గుకేశ్.. ఇవాళ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ( Khel Ratna)అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ అవార్డులను స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ఈ వేడుక జరిగింది. హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్ గోల్డ్ విన్నింగ్ హైజంపర్ ప్రవీణ్ కుమార్ కూడా ఖేల్ రత్న పురస్కారాలను అందుకున్నారు.
Double medalist at the #ParisOlympics @realmanubhaker receives Major Dhyan Chand Khel Ratna Award 2024 from President Droupadi Murmu @rashtrapatibhvn @YASMinistry #NationalSportsAwards2024 pic.twitter.com/CQkXIgYlVr
— PIB India (@PIB_India) January 17, 2025
22 ఏళ్ల షూటర్ మనూ భాకర్ .. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. గత ఏడాది ఆగస్టులో జరిగిన క్రీడల్లో ఆమె 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం ఈవెంట్లలో బ్రాంచ్ మెడల్ గెలుచుకున్నది. ఇక 18 ఏళ్ల చెస్ చాంపియన్ గుకేశ్.. యువ ప్రపంచ చాంపియన్ అయ్యాడు. చైనాకు చెందిన డింగ్ లీరెన్ను ఓడించి ఆ టైటిల్ అందుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో చెస్ క్రీడాకారుడిగా నిలిచాడు.
President Droupadi Murmu confers Major Dhyan Chand Khel Ratna Award 2024 on World Chess Champion @DGukesh at Rashtrapati Bhavan
@rashtrapatibhvn @YASMinistry #NationalSportsAwards2024 pic.twitter.com/Y2J6vdu4yI— PIB India (@PIB_India) January 17, 2025