Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన భారత షూటర్ మనూ భాకర్ (Manu Bhaker) ఈ మధ్య పబ్లిక్ అప్పీరియన్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ 22 ఏళ్ల మనూ పారిస్ ఒలింపిక్స్లో ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల ఒక స్కూల్ ఫంక్షన్లో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా మనూ భాకర్ ఓ చక్కని చీరలో మెరిసి వావ్ అనిపిస్తోంది. ఈ ప్రొఫెషనల్ షూటర్, మరో ఒలింపిక్ విన్నర్ అమన్ సెహ్రావత్తో కలిసి తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ టీవీ ప్రోగ్రామ్ షూటింగ్కు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె ట్రెడిషనల్ లుక్లో దర్శనమిచ్చింది. సాధారణంగా అథ్లెయిజర్ లేదా క్యాజువల్ డ్రెస్సులు ధరించే మనూ.. ఈ టీవీ ప్రోగ్రామ్ కోసం చీరలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎప్పుడూ టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్లో కనిపించే ఈ అందాల యువ క్రీడాకారిణిని చీరలో చూడగానే అందరూ మనసు పారేసుకుంటున్నారు. ఆమెను నేషనల్ క్రష్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.