పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో రెండో మెడల్ కొట్టింది ఇండియా. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. షూటర్ మనూ భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది. మిక్స్డ్ టీమ్‌లో మనూ భాకర్‌తో పాటు సరబ్జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మనూ భాకర్ నిలిచారు.
BREAKING: India WIN Bronze medal 🔥🔥🔥
Manu Bhaker & Sarabjot Singh beat Korean pair 16-10 in 10m Air Pistol Mixed team event to win India’s 2nd medal in Paris. #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/G2XcZRgpoN
— India_AllSports (@India_AllSports) July 30, 2024
మనూ-సరబ్జోత్ జ్యోడి ఆరంభంలో తడబడ్డా.. రెండో సిరీస్ నుంచి అద్భుత ఆటను ప్రదర్శించారు. దాదాపు ప్రతి రౌండ్లో ఆధిపత్యాన్ని చాటారు. వాస్తవానికి కొరియా చాలా బలమైన ప్రత్యర్థి. కానీ మనూ ప్రతి రౌండ్లోనూ కీలకమైన పాయింట్లను సాధించారు. 16-10 పాయింట్లతో మనూ భాకర్ టీమ్ .. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది.
𝐌𝐚𝐧𝐮 𝐁𝐡𝐚𝐤𝐞𝐫 𝐜𝐫𝐞𝐚𝐭𝐞𝐬 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘 🔥🔥🔥
She becomes 1st EVER Indian athlete to win 2 Olympic medals in a single edition post Independence.
A STAR ✨✨✨ #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/v1MANrvcvf
— India_AllSports (@India_AllSports) July 30, 2024
ఇదే ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మనూ భాకర్ .. కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. యావత్ దేశం గర్వించదగ్గ రీతిలో మనూ తన ట్యాలెంట్ ప్రదర్శించారు.