ఢిల్లీ: బల్లెం వీరుడు నీరజ్ చోప్రాను పెండ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలపై యువ షూటర్ మను భాకర్ స్పందించింది. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ‘ఇండియా హౌస్’ లో కలుసుకున్న ఈ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకోవడంతో ఈ చర్చ ఊపందుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మను ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘మా అమ్మతో నీరజ్ ఏం మాట్లాడనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో నేను అక్కడ లేను. కానీ నేను, నీరజ్ 2018 నుంచి పలు పోటీలు, ఈవెంట్స్‌లో కలుసుకుంటున్నాం. కాంపిటీషన్స్లలో కలుసుకున్నప్పు డూ సరదాగా తక్కువగానే మాట్లాడుకుంటాం. అంతే తప్ప మా ఇద్దరి మధ్య జనం అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు’ అని స్పష్టతనిచ్చింది.