పారిస్: షూటర్ మనూ భాకర్(Manu Bhaker) .. పారిస్ ఒలింపిక్స్‌లో మరో మెడల్‌పై కన్నేసింది. ఇవాళ జరుగుతున్న 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లోని.. ప్రిసిషన్ రౌండ్లో ఆమె సంయుక్తంగా మూడవ స్థానంలో నిలుచున్నది. క్వాలిఫికేషన్ రౌండ్లో ఆమె 294 పాయింట్లు సాధించింది. ఇక ఇదే ఈవెంట్లో మరో షూటర్ ఈషా కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. 291 పాయింట్లతో ఆమె 10వ స్థానంలో నిలుచున్నది. ప్రిసిషన్ రౌండ్ తర్వాత ర్యాపిడ్ రౌండ్లో తమ అదృష్టాన్ని పరీక్షించనున్నారు. అయితే రెండు రౌండ్లలో కలిపి టాప్ 8 స్థానాల్లో ఉన్నవారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
Shooting Update: At end of Precision round (Qualification) of 25m Pistol event:
Manu 3rd (294 pts) | Esha 10th (291 pts)
Rapid round (Qualification) will be up next | Top 8 will qualify for Final. #Paris2024 #Paris2024withIAS
— India_AllSports (@India_AllSports) August 2, 2024