Eiffel Tower Logo: మనూ భాకర్‌కు అరుదైన గుర్తింపు.. ఎక్స్ అకౌంట్లో ఈఫిల్ టవర్ లోగో
Eiffel Tower Logo : కాంస్య పతక విజేత.. షూటర్ మనూభాకర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె ఎక్స్ అకౌంట్ ఖాతాకు ఈఫిల్ టవర్ లోగో యాడైంది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన కారణంగా.. ఆమె అకౌంట్‌కు ఆ లోగోను జోడించారు.
న్యూఢిల్లీ: భారత షూటర్ మనూ భాకర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో .. ఈఫిల్ టవర్ లోగో(Eiffel Tower Logo) జతకూడింది. మనూ భాకర్ అకౌంట్‌కు వెరిఫైడ్ బ్లూ టిక్ కూడా ఉన్నది. పారిస్ ఒలింపిక్స్ 2024 షూటింగ్ ఈవెంట్లో ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆదివారం మనూ భాకర్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈఫిల్ టవర్ లోగో ఉందంటే.. ఆ అకౌంట్ హోల్డర్‌కు 2024 ఒలింపిక్స్‌లో మెడల్ వచ్చినట్లు సంకేతమన్నమాట.
ఇక ఇవాళ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ .. కాంస్య పతకం కోసం ఆడనున్నారు. రేపు ఆ ఫైనల్ ఈవెంట్ ఉంటుంది. ఒకవేళ మంగళవారం జరిగే ఫైనల్లో మనూ భాకర్ పతకాన్ని గెలిస్తే, అప్పుడు ఆమె కొత్త చరిత్ర లిఖించిన అథ్లెట్‌గా నిలుస్తుంది. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి క్రీడాకారిణిగా కీర్తిని ఆమె పొందనున్నది. 1990లో నార్మన్ ప్రిట్చార్డ్.. రెండు సిల్వర్ మెడల్స్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఏ ఒక్క ఇండియన్ అథ్లెట్ కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించలేదు.
Winning this medal is a dream come true, not just for me but for everyone who has supported me. I am deeply grateful to the NRAI, SAI, Ministry of Youth Affairs & Sports, Coach Jaspal Rana sir, Haryana government and OGQ. I dedicate this victory to my country for their incredible… pic.twitter.com/hnzGjNwUhv
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) July 28, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

