న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు కాంస్యం అందించిన స్టార్ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ హాకీ ప్రొ లీగ్‌లో టీమ్‌ను ముందుకు నడపనున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్‌సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. దేశీయ టోర్నీల్లో సత్తా చాటుతున్న యువ డ్రాగ్‌ఫ్లికర్ జోగ్రాజ్ సింగ్, స్ట్రయికర్ అభిషేక్‌కు అవకాశం ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న 14 మందికి జట్టులో చోటు దక్కగా.. వారిలో స్టార్ గోల్ కీపర్స్ పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బహదూర్ ఉన్నారు. బెంగళూరులోని జాతీయ శిక్షణ శిబిరంలో ఉన్న భారత జట్టు ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాకు చేరుకోనుండగా.. 8న ఫ్రాన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.