హనుమకొండ చౌరస్తా, జనవరి 12 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 34వ సీనియర్ నేషనల్ సెపక్తక్రా జాతీయ స్థాయి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఉమెన్ రెగ్యు ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. కేరళ, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్‌పై 0-2తో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లారు. మెన్ రెగ్యు ఈవెంట్లో హిమాచల్ ప్రదేశ్, గోవా, ఒడిశా, కర్నాటకపై గెలిచిన తెలంగాణ.. ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది