IND vs PAK : మహిళల టీ20 ప్రపంచకప్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన(68) అర్ధ శతకంతో కదం తొక్కింది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా తన మార్క్ విధ్వసంతో పాకిస్థాన్ బౌలర్లను వణికించిన మంధాన భారీ స్కోర్‌కు పునాది వేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(36) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. డెత్ ఓవర్లలో రీచా ఘోష్(34) తుఫాన్ బ్యాటింగ్‌తో రెచ్చిపోగా పాక్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది భారత్.
పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత్ భారీ స్కోర్‌తో పాకిస్థాన్‌కు సవాల్ విసిరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆదిలోనే పాక్ బౌలర్లు కష్టాల్లోకి నెట్టారు. షఫాలీ వర్మ(6), జెమీమా రోడ్రిగ్స్(1)లు విఫలమైనా ఓపెనర్ స్మృతి మంధాన(68) నిలబడింది. దాయాది బౌలర్లను కాచుకున్న మంధాన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(36)తో కలిసి జట్టును ఆదుకుంది. కౌర్ స్టాండ్ ఇవ్వగా.. మంధాన అటాకింగ్ గేమ్‌తో పాక్ బౌలింగ్ దళాన్ని చీల్చి చెండాడింది.
Cometh the hour, cometh the Vice-Captain 🫡
Smriti Mandhana fights through the pressure to register her 5️⃣th #T20WorldCup half-century 👏
Updates ▶️ https://t.co/1tfRc3jcrX#TeamIndia | #WomenInBlue | @mandhana_smriti pic.twitter.com/2vFIPAHNy5
— BCCI Women (@BCCIWomen) June 14, 2026
రెండుసార్లు మంధానను ఔట్ చేసే అవకాశాన్ని పాక్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. బౌండరీలతో విరుచుకుపడిన మంధాన అర్ధ శతకంతో జట్టుకు మంచి స్కోరందించింది. కానీ, స్వల్ప తేడాకే కౌర్, మంధాన ఔటవ్వగా.. డెత్ ఓవర్లలో రీచా ఘోష్(34) బ్యాట్ ఝులిపించింది. దీప్తి శర్మ(12)తో కలిసి ధనాదన్ ఆడిన రీచా.. తస్మియా రుబాబ్ వేసిన 19వ ఓవర్లో 4, 6, 4, 4తో 23 రన్స్ పిండుకుంది. చివరి ఓవర్లో 15 పరుగులే రావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.