ములుగు రూరల్, ఏప్రిల్ 28 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి బాక్సింగ్ కోచ్ గా ములుగు జిల్లాకు చెందిన మామిడిపెల్లి రమేశ్ ఎంపికయ్యారు. ఈనెల 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగే 68వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొనే అండర్-19 బాలికల బాక్సింగ్ జట్టుకు కోచ్గా రమేశ్ వ్యవహరించనున్నారు.