న్యూఢిల్లీ : ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కేవల్ కిరణ్ క్లోతింగ్ లిమిటెడ్(కేకేసీఎల్) టీమ్ఇండియా అధికారిక స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో వారి బ్రాండ్ దుస్తుల ‘కిల్లర్’ లోగోను ఛాతీకి కుడి ప్రదేశంలో ముద్రించిన జెర్సీలను టీమ్ఇండియా ధరిస్తుంది. భారత క్రికెట్ జట్టు వస్త్ర ధారణలో భాగస్వాములైనందుకు గర్విస్తున్నామని కేకేసీఎల్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ జైన్ హర్షం వ్యక్తం చేశారు.