Mahavir Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకున్న వినేశ్ ఫోగాట్ (Mahavir Phogat)కు దేశమంతా అండగా నిలుస్తోంది. మూడోసారైనా ఒలింపిక్స్‌లో పతకం కల నిజం చేసుకోవాలనుకున్న ఆమెకు నిరాశే మిగిలింది. ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుతో ఉమ్మడి రజతం (Silver Medal)పై వినేశ్ పెట్టుకున్న ఆశలు ఆవిరైన నేపథ్యంలో ఆమె మేనమామ మహవీర్ ఫోగాట్ (Mahavir Phogat) భావోద్వేగానికి లోనయ్యాడు.
వినేశ్‌పై అనర్హత వేటు, రజతం రాకపోవడం కంటే ఆమె జీవితంలో వరుస విషాదాలు జరుగుతుండడం బాధాకరమని ఆయన అన్నారు. ‘విశ్వ క్రీడల్లో నా మేనకోడలిపై అనర్హత వేటు పడడం కంటే ఆమె జీవితంలో వరుసపెట్టి విషాదాలు జరుగుతుండడంతో నాకు చాలా బాధగా అనిపిస్తోంది. తొమ్మిదేండ్లకే వినేశ్ తండ్రి రాజ్‌పాల్ ఫొగాట్ (Rajpal Phogat) చనిపోయారు. కొన్ని రోజుల్లోనే ఆ బాధను దిగమింగిన ఆమె మల్లీ కుస్తీ కోసం మట్టిలోకి దిగింది. తాను ఒంటరిగానే ప్రపంచంతో పోరాడగలననే పంతం ఆమెది. ఆ కోపమే ఆమె ప్రదర్శనలో దూకుడుకు కారణమైంది.
రియో ఒలింపిక్స్‌లో వినేశ్ గాయంతో వెనుదిరిగింది. ఇక టోక్యోలో ఆమె అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇలా వరుసగా విషాదకరమైన సంఘటనలు ఎదురవుతున్నా ఆమె సంకల్ప బలంతో ముందడుగు వేస్తూనే ఉంది’ అని మహవీర్ తెలిపారు. అంతేకాదు వినేశ్ రిటైర్మెంట్పై కూడా చర్చిస్తానని ఆయన అన్నారు. పారిస్‌లో ఉండగానే వినేశ్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పుడు మీడియాతో మాట్లాడిన మహవీర్.. ఒలింపిక్స్‌లో పతకం గెలిచేందుకు వంద మంది వినేశ్ ఫోగాట్లను తాను తయారు చేయగలనని మాజీ రెజ్లర్ చెప్పారు. 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరుగబోయే విశ్వ క్రీడల్లో వినేశ్ ఫొగాట్ పాల్గొనేలా చూస్తానని మహవీర్ అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ అంచనాలు అందుకుంటూ ఫైనల్ చేరింది. ఆగస్టు 7 బుధవారం ఉదయం అమెరికా రెజ్లర్ సరాహ్ హిల్డెబ్రాండ్త్తో పసిడి ఫైట్ కాసేపట్లో ఉందనగా నిర్వాహకులు ఆమె బరువు కొలిచారు. అయితే.. 100 గ్రాముల అదనపు బరువు ఉండడంతో వినేశ్‌ను నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో,ఫైనల్ ఆడలేకపోయిన ఆమె అప్పీల్‌పై అర్బిట్రేషన్ కోర్టు (CAS)ను ఆశ్రయించింది. విశ్వ క్రీడల్లో విశేషంగా రాణించిన వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్ ఇస్తామని హర్యానాకు చెందని ఖాప్ పంచాయతీ (Khap Panchayat) ప్రకటించింది.
Aman Sehrawat | ఒలింపిక్ పతకంతో ప్రమోషన్.. ఏ పోస్ట్ ఇచ్చారంటే..?
PM Modi | పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలతో మోదీ భేటీ.. ప్రధానికి ప్రత్యేక బహుమతి ఇచ్చిన హాకీ జట్టు
TMC MP | దీదీపై నోరుపారేసుకుంటున్న కాషాయ పాలకులు : శత్రుఘ్న సిన్హా