హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెర్బియా వేదికగా గత నెలలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన మద్దుకూరి రితేశ్ సత్తాచాటాడు. మొత్తం 43 దేశాలకు చెందిన 500 మంది విద్యార్థులు పోటీపడిన టోర్నీలో బాలుర అండర్-13 ఓపెన్ కేటగిరీలో బరిలోకి దిగిన రితేశ్ నాలుగో స్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో 102 ఎలో రేటింగ్ పాయింట్స్‌కు తోడు బ్లిట్జ్‌లో 295 పాయింట్లు, ర్యాపిడ్‌లో 100 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.