యూఎస్ ఓపెన్ జూనియర్ సింగిల్స్ విభాగంలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ మాయా రాజేశ్వరన్ రేవతి సంచలన ప్రదర్శనతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. కోయంబత్తూరు (తమిళనాడు)కు చెందిన 16 ఏండ్ల మాయా.. జూనియర్ గర్ల్స్ సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో 7-6 (7/5), 6-3తో ఝాంగ్ కియాన్ వీ (చైనా)ను ఓడించింది.
గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో మాయా బలమైన సర్వీసులతో ప్రత్యర్థిని బోల్తొ కొట్టించడమే గాక కోర్టు అంతా కలియతిరుగుతూ పాయింట్లు రాబట్టింది. ఈ కోయంబత్తూరు అమ్మాయి రఫెల్ నాదల్ అకాడమీ (స్పెయిన్‌లోని మల్లొక్ర)లో శిక్షణ పొందుతున్నది.