WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఐదో రోజు అద్భుతం జరగకపోతుందా? అని ఎదురుచూసిన అభిమానులకే నిరాశే మిగిలింది. తొలి ఇన్నింగ్స్లో ఆదుకున్న అజింక్యా రహానే(46), శార్దూల్ ఠాకూర్(0) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. దాంతో, 226 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. శ్రీకర్ భరత్(22) , ఉమేశ్ యాదవ్(0) క్రీజులో ఉన్నారు. ఓటమి అంతరం తగ్గేంచేందుకు పోరాడుతున్నారు.
టీమిండియా విజయానికి మరో 231 పరుగులు కావాలి. కానీ మిగిలినవి మూడు వికెట్లు అంతే. ఐదో రోజు తొలి సెషన్లో బోలాండ్ భారత్కు షాకిచ్చాడు. విరాట్ కోహ్లీ(49), జడేజా(0)లను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు.