హైదరాబాద్, ఆట ప్రతినిధి: చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా ఎల్ వెంకట్రామ్రెడ్డి(ఎల్వీఆర్) స్మారక బాస్కెట్‌బాల్ టోర్నీ శుక్రవారం మొదలైంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, బీఎఫ్ఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ నార్మన్ ఇసాక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్ర క్రీడారంగానికి ఎల్వీఆర్ చేసిన సేవలు మరువలేనివి. సుదీర్ఘ కాలం క్రీడాభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. ఎంతో మందికి క్రీడాకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో సమ్మర్ క్యాంప్‌ల నిర్వహణకు ఎల్వీఆర్ ఆద్యుడు’ అని అన్నారు.