Lungi Ngidi | న్యూఢిల్లీ: త్వరలో మొదలుకానున్న ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగ్డీ పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా లీగ్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని ఎంగ్డీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో ఎంగ్డీ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ జేక్‌ప్రేజర్ మెక్ గుర్క్‌ను తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రకటించింది.
మెల్బోర్న్కు చెందిన మెక్‌గుర్క్ హార్డ్‌హిట్టింగ్ ఓపెనింగ్ బ్యాటర్‌తో పాటు లెగ్‌స్పిన్నర్. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా మెక్‌గుర్క్..ఆసీస్ తరఫున అరంగేట్రం చేశాడు.