IPL 2024 | ముంబైకి కొత్త పేసర్.. నెట్స్‌లో బాదేస్తున్న హిట్‌మ్యాన్
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను స్టార్ పేసర్ల గాయాలు కలవరపెడుతున్నాయి. స్టార్ పేసర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ గాయపడడంతో అతడి స్థానంలో ముంబై ఇంగ్లండ్ బౌలర్ ల్యూక్ వుడ్(Luke Wood)ను...
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను స్టార్ పేసర్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దిల్షాన్ మదుషనక, నువాన్ తుషారలు గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానుండగా.. టోర్నీకి మూడు రోజులే ఉందనగా స్టార్ పేసర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ గాయపడ్డాడు. దాంతో, అతడి స్థానంలో ముంబై ఇంగ్లండ్ బౌలర్ ల్యూక్ వుడ్(Luke Wood)ను తీసుకుంది. రూ.50 లక్షల కనీస ధరకు అతడితో ఒప్పందం చేసుకుంది.
లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ వుడ్ మంగళవారం ముంబై జట్టుతో కలిశాడు. ల్యూక్ ఇప్పటివరకూ 5 టీ20లు ఆడాడంతే. పొట్టి ఫార్మాట్లో ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా ఈ పేసర్ 8 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన.. 3/24 .
𝘓𝘶𝘬𝘦 who’s here! 😍💙#OneFamily #MumbaiIndians @lwood_95 pic.twitter.com/dU5bqaQbFp
— Mumbai Indians (@mipaltan) March 19, 2024
హిట్‌మ్యాన్ మొదలెట్టేశాడు
మరోవైపు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. నెట్స్‌లో అన్ని రకాలా షాట్లు బాదుతూ ఐపీఎల్ 17వ సీజన్‌కు తాను సిద్దమంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. 17వ సీజన్ వేలానికి ముందే రోహిత్‌ను ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుంచి తప్పించింది. గుజరాత్ నుంచి ట్రేడింగ్ ద్వారా కొన్న హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
🙂 ➡️ 😊 ➡️ 😃 ➡️ 😁#OneFamily #MumbaiIndians @ImRo45 pic.twitter.com/PtPtYBGsfc
— Mumbai Indians (@mipaltan) March 19, 2024
భారమంతా వీళ్లపైనే
ముంబై పేస్ బౌలింగ్ యూనిట్ గతంలో కంటే ఈసారి బలంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మద్వాల్, నువాన్ తుషార, మధుషనక, గెరాల్డ్ కోయెట్జీ, ల్యూక్ వుడ్ వంటి స్టార్లు ఉన్నారు. అయితే.. వీళ్లలో తుషార, మధుషనకలు బంగ్లాదేశ్ పర్యటనలో గాయపడ్డారు. దక్షిణాఫ్రికా యువ పేసర్ కోయెట్జీ ఇంకా తుంటి కండరాల గాయం నుంచి కోలుకోలేదు.
నువాన్ తుషార

ఈ ముగ్గురూ ఫిట్‌గా మారేంత వరకూ బుమ్రా, మధ్వాల్, అర్జున్ టెండూల్కర్లు పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు. ఆల్‌రౌండర్ అయిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం అదనపు పేసర్‌గా ఓ చేయి వేసే చాన్స్ ఉంది. 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై మార్చి 23న గుజరాత్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
- Baba Ramdev: పతంజలి యాడ్స్ కేసులో బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు సమన్లు
- SS Rajamouli | త్వరలో షూటింగ్ షూరూ.. మహేశ్‌తో సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన దర్శకధీరుడు
- Indian Air Force | బాపట్లలో జాతీయ రహదారిపై సుఖోయ్ యుద్ధ విమానాల ల్యాండింగ్.. VIDEOS
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

