SS Rajamouli | త్వరలో షూటింగ్ షురూ.. మహేశ్‌తో సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన దర్శకధీరుడు
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జపాన్ వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మీడియాతో మాట్లాడుతూ తాను మహేశ్‌తో సినిమా చేస్తున్నట్లు చెప్పారు.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జపాన్ వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మీడియాతో మాట్లాడుతూ తాను మహేశ్‌తో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఆయన మంచి నటుడని, చాలా అందంగా ఉంటారని వెల్లడించారు.. మీలో కొందరికి ఆయన గురించి తెలిసే ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నదని తెలిపారు. త్వరలో చిత్రీకరణను ప్రారంభిస్తామన్నారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసి మహేశ్‌బాబును ఇక్కడికి తీసుకురావాలని భావిస్తున్నాని చెప్పారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ గతేడాది జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకులతో కలిసి ఆ సినిమాను వీక్షించేందుకు తన సతీమణితో కలిసి రాజమౌళి ఇటీవల అక్కడికి వెళ్లారు. వారి అభిమానాన్ని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.

‘జపాన్‌వాసులు ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఎంతగానో ఆదరిస్తున్నారు. అక్కడి ప్రజలు తమకు ఇష్టమైనవారికి ‘ఆర్గామి క్రేన్స్’ను బహూకరించడం సంప్రదాయం. ఈ చిత్రాన్ని వీక్షించిన 83 ఏళ్ల వృద్ధురాలు నాకు దానిని ఆప్యాయంగా ఇచ్చారు. దీనికోసం థియేటర్ బయట ఆమె కొన్ని గంటలు ఎదురుచూశారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹
Some gestures can never be repaid.
Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw— rajamouli ss (@ssrajamouli) March 18, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Japan
- Mahesh babu
- NTR
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

