IPL | అహ్మదాబాద్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైన వేళ..లీగ్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 33 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. గత పోరులో తమకు ఎదురైన ఓటమికి లక్నో ప్రతీకారం తీర్చుకుంది.
తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117, 10 ఫోర్లు, 8 సిక్సర్లు), నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) 20 ఓవర్లలో 235/2 స్కోరు చేసింది. సీజన్ ఆసాంతం రాణించిన టైటాన్స్ బౌలర్లు.. లక్నోతో మ్యాచ్‌లో తేలిపోయారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. షారుక్‌ఖాన్(57), రూథర్‌ఫర్డ్ (38) రాణించారు. ఓరూర్కీ (3/27), అవేశ్‌ఖాన్ (2/51), బదోని (2/4) గుజరాత్‌ను నిలువరించారు.
ఈ సీజన్లో ప్యూర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతూ సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగుతున్న మార్ష్.. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. సిక్సర్‌తో అతడి బాదుడు మొదలైంది. తొలి ఐదు ఓవర్లలో ఆశించిన స్థాయిలో విజృంభించలేకపోయిన మార్ష్, మార్క్మ్ (36).. ఆ తర్వాత రెచ్చిపోయారు. రబాడా ఆరో ఓవర్లో మార్క్మ్.్ర. రెండు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్ గేర్ మార్చాడు. సాయికిషోర్ 10వ ఓవర్లో మార్క్మ్.్ర. లాంగాన్ వద్ద షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మార్క్మ్ ఔట్ అయిన ఆనందం టైటాన్స్‌కు ఎంతో సేపు నిలువలేదు.
మూడో స్థానంలో వచ్చిన పూరన్ అండగా మార్ష్ రెచ్చిపోయాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన అతడు.. రషీద్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో 6, 4, 6, 4, 4తో 25 పరుగులు రాబట్టాడు. సిరాజ్ ఓవర్లో పూరన్ 4, 6, 4తో రెచ్చిపోవడంతో గుజరాత్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అర్షద్ ఓవర్లో సింగిల్‌తో 56 బంతుల్లోనే మార్ష్ శతకం నమోదుచేశాడు. ఐపీఎల్లో అతడికిదే తొలి శతకం కాగా ఈ సీజన్లో ఓవర్సీస్ ప్లేయర్‌గా అతడిదే మొదటి సెంచరీ. ఆఖర్లో ధాటిగా ఆడే క్రమంలో మార్ష్ నిష్క్రమించాడు. మార్ష్, పూరన్ ద్వయం రెండో వికెట్‌కు 121 రన్స్ జోడించారు. లక్నో తరఫున రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమం. చివర్లో రిషభ్ పంత్ (16*) తనదైన రెండు ట్రేడ్‌మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.
రికార్డు ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు దూకుడుగా ఆడేందుకు యత్నించి విఫలమయ్యారు. సాయి సుదర్శన్ (21), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (35) బౌండరీలతో రెచ్చిపోయారు. కానీ ఓరూర్క్ ఐదో ఓవర్లో సుదర్శన్‌ను ఔట్ చేసి లక్నోకు తొలి బ్రేక్‌ను ఇచ్చాడు. అవేశ్ 8వ ఓవర్లో సమద్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18 బంతుల్లోనే 3 బౌండరీలు, 2 సిక్సర్లతో వేగంగా ఆడిన బట్లర్ (33)ను ఆకాశ్ మహారాజ్ పదో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రూథర్‌ఫర్డ్(38), షారుక్‌ఖాన్(50 నాటౌట్) ఇన్నింగ్స్ బాధ్యతను భుజానేసుకున్నారు. వీర్దిదరు లక్నో బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ముఖ్యంగా షారుక్ దూకుడగా ఆడాడు. రూథర్‌ఫర్డ్‌ను అండగా చేసుకుంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇన్సింగ్ సాఫీగా సాగుతున్న క్రమంలో రూథర్‌ఫర్డ్‌ను ఓరూర్కీ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు సాధించాల్సిన లక్ష్యం పెద్దగా ఉండటం, బంతులు తక్కువ ఉండటంతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు.
ఐపీఎల్లో శతకాలు చేసిన అన్నాతమ్ముల జోడీగా మార్ష్ బ్రదర్స్ రికార్డు సృష్టించారు. 2008 సీజన్లో మిచెల్ మార్ష్ అన్న షాన్ మార్ష్.. పంజాబ్ తరఫున ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ సీజన్లో షాన్.. 11 ఇన్నింగ్స్‌లో ఒక శతకం, 5 అర్ధ శతకాలతో 616 రన్స్ చేశాడు. 2025లో మిచెల్ మార్ష్.. 12 ఇన్నింగ్స్‌లలో 560 రన్స్ చేయగా అతడి ఖాతాలోనూ ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
లక్నో: 20 ఓవర్లలో 235/2 (మార్ష్ 117, పూరన్ 56*, సాయి 1/34, అర్షద్ 1/36); గుజరాత్: 20 ఓవర్లలో 202/9(షారుక్‌ఖాన్ 57, రూథర్‌ఫర్డ్ 38, ఓరూర్కీ 3/27, బదోని 2/4)