లక్నో: ఈ సీజన్‌తో ఐపీఎల్లో కొత్తగా అడుగు పెట్టనున్న లక్నో ఫ్రాంచైజీ తమ జట్టు పేరు నిర్ణయించింది. అభిమానుల అభిష్టం మేరకు తమ టీమ్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌గా నామకరణం చేసినట్లు ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ‘నామ్ బనావో, నామ్ కమావో’ కాంటెస్ట్ నిర్వహించి.. అందులో అభిమానుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు టీమ్ పేరును ఎంపిక చేసినట్లు సంజీవ్ పేర్కొన్నారు.