ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారధి కేఎల్ రాహుల్ (103 నాటౌట్) మరోసారి సెంచరీతో చెలరేగాడు. కొన్నిరోజుల క్రితం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా రాహుల్ ఇదే స్కోరు చేయడం గమనార్హం. అయితే ఈసారి అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం పూర్తిగా కరువైంది. క్వింటన్ డీకాక్ (10), మనీష్ పాండే (22), మార్కస్ స్టొయనిస్ (0), కృనాల్ పాండ్యా (1), దీపక్ హుడా (10), ఆయుష్ బదోనీ (14) అందరూ స్పల్పస్కోర్లు మాత్రమే చెయ్యగలిగారు.
చివర్లో బ్యాటింగ్ వచ్చిన జేసన్ హోల్డర్.. తను ఎదుర్కొన్న రెండు బంతుల్లోనూ ఒక్క పరుగు కూడా చెయ్యలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పొలార్డ్, రైలీ మెరెడిత్ చెరో 2 వికెట్లతో చెలరేగగా.. డానియల్ శామ్స్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.
103* off 62 deliveries from the #LSG Skipper.
Take a bow, @klrahul11 #TATAIPL #LSGvMI pic.twitter.com/RkER4HAf6l
— IndianPremierLeague (@IPL) April 24, 2022