ఐపీఎల్ వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలైన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. 8వ మ్యాచ్‌కు సిద్ధమైంది. స్టార్ బ్యాటర్కేఎల్ రాహుల్ సారధ్యంలోని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండోసారి తలపడేందుకు సిద్ధమైంది. కొన్నిరోజుల క్రితం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో చెలరేగాడు.
మరి ఈసారి రాహుల్‌ను కట్టడి చేసి ఈ సీజన్లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసి వాళ్ల మెంటార్ సచిన్ టెండూల్కర్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తుందేమో చూడాలి. ముంబై జట్టు ఎలాంటి మార్పులూ లేకుండానే బరిలో దిగుతుండగా.. లక్నో జట్టులో మొహ్సిన్ ఖాన్.. ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయి, మొహ్సిన్ ఖాన్
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, కీరన్ పొలార్డ్, డానియల్ శామ్స్, జయదేవ్ ఉనద్కత్, రైటీ మెరెడిత్, జస్ప్రీత్ బుమ్రా
A look at the Playing XI for #LSGvMI
Live – https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL https://t.co/NEBreGvGGB pic.twitter.com/dxGM8TF0xV
— IndianPremierLeague (@IPL) April 24, 2022