పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సారధి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచాడు. అయితే జట్టులో కీలకమైన ఉమేష్ యాదవ్.. పిక్క కండరాల నొప్పితో మ్యాచ్‌కు దూరం అవుతున్నట్లు శ్రేయాస్ చెప్పాడు.
అతని స్థానంలో హర్షిత్ రాణా ఆడుతున్నట్లు వెల్లడించాడు. లక్నో సారధి రాహుల్ కూడా తమ జట్టులో ఒక మార్పు జరిగినట్లు వెల్లడించాడు. కృష్ణప్ప గౌతమ్ స్థానంలో ఆవేష్ ఖాన్ ఆడుతున్నట్లు చెప్పాడు.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, ఆవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయి
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, శివమ్ మావి.