కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు సారధి, ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. సౌథీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఐదో బంతికి రాహుల్ మైదానం వీడాడు. సౌథీ డెలివరీని సరిగా టైం చేయలేకపోయిన డీకాక్.. ఆఫ్ సైడ్ బంతిని పంపాడు.
పరుగు కోసం రాహుల్ తన క్రీజు వీడాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. అద్భుతంగా బంతిని అందుకొని డైరెక్ట్త్రో విసిరాడు. దాంతో రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు.