లక్నో జట్టును నిలబెట్టిన దీపక్ హుడా (55)ను మోడ్రన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు తన బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టినందుకు పగ తీర్చుకున్నాడు. రషీద్ వేసిన లెంగ్త్ బాల్‌ను హుడా స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మిస్ అవడంతో బంతి అతని ప్యాడ్లను తాకింది. రషీద్ వెంటనే అప్పీలు చేశాడు. కానీ అంపైర్ నాటౌట్ అన్నాడు.
దాంతో కెప్టెన్ హార్దిక్‌ను సంప్రదించిన రషీద్.. రివ్యూ కోరాలన్నాడు. రివ్యూలో బంతి వికెట్లను తాకుతుందని తేలడంతో హుడా మైదానం వీడాడు. ఎట్టకేలకు అతన్ని అవుట్ చేసినందుకు గుజరాత్ శిబిరం సంబరాలు చేసుకుంది. లక్నో జట్టు 29/4తో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హుడా అద్భుతమైన ఆట తీరుతో జట్టును ఆదుకున్నాడు.