లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ మధ్య తొలి మ్యాచ్ తొలి బంతికే వికెట్ కూలింది. గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్ బ్యాటర్, ఎల్ఎస్జీ సారధి కేఎల్ రాహుల్ (0)ను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. షమీ ఫుల్ లెంగ్త్‌లో వేసిన బంతిని ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు.
దీంతో లైట్‌గా ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ మాథ్యూ వేడ్ చటుక్కున అందుకున్నాడు. అంతే, గుజరాత్ టీం అంతా అప్పీల్ చేసింది. కానీ అంపైర్ నాటవుట్ అన్నాడు. బౌలర్, కీపర్‌పై నమ్మకం ఉంచిన హార్దిక్ పాండ్యా వెంటనే డీఆర్ఎస్ కోరాడు. బంతి, రాహుల్ బ్యాటును తాకినట్లే తేలడంతో అతన్ని అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని గుజరాత్ అద్భుతంగా ప్రారంభించిందని అభిమానులు సంతోషిస్తున్నారు.
Gone gone
Lsg captain kl rahul departs#TataIPL2022 #LSGvsGT pic.twitter.com/D0iy5IntFA— King Pankaj (@KingPankaj18) March 28, 2022