Lucknow Super Giants : ఐపీఎల్‌కు కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో ఇప్పటికే పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ ముమ్మరం చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సైతం మైదానంలోకి దిగనుంది. పంతొమ్మిదో సీజన్లో కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో జట్టు.. టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. శనివారం కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant), ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka) సహా క్రికెటర్లు రాములోరి దీవెనలు తీసుకున్నారు.
పంతొమ్మిదో సీజన్‌ను గొప్పగా ఆరంభించాలనే ఉద్దేశంతో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు రాముడి ఆలయాన్ని సందర్శించారు. దేవుడి ఆశీస్సులతో టోర్నీలో ఇరగదీసేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Dr. Sanjiv Goenka visits Ram Janmabhoomi in Ayodhya along with captain Rishabh Pant and other members of the squad to receive blessings 🙏
JAI SHREE RAM pic.twitter.com/OdcNmcp0zV
— Lucknow Super Giants (@LucknowIPL) March 21, 2026
‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్ఐతో తెలిపాడు.
Our leader. Our inspiration. Welcome home, Dr. Sanjiv Goenka ❤️💙 pic.twitter.com/hw5aWdr7x0
— Lucknow Super Giants (@LucknowIPL) March 21, 2026
ఐపీఎల్లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్‌కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 11న మ్యాచ్‌తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది.