Kane Williamson : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కోచింగ్ బృందాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈమధ్యే మాజీ పేసర్ భరత్ అరుణ్ (Bharat Arun)ను బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్న లక్నో… మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి తీరాలనే కసితో ఉన్న సంజీవ్ గొయెంకా ఫ్రాంచైజీ న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson)ను సలహాదారుగా తీసుకుంది. సుదీర్ఘ అనుభవం కలిగిన ఈ కివీస్ మాజీ సారథితో వ్యూహాత్మక సలహాదారుగా ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఏడాది ఎస్ఏ20లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు విలియమ్సన్ ప్రాతినిధ్యం వహించాడు. దాంతో.. అతడి సేవల్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో 19వ సీజన్ కోసం కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో తమ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. కూల్, కామ్, కాలిక్యులేటెడ్ కేన్ విలియమ్సన్ మా థింక్ ట్యాంక్‌లో స్ట్రాటజిక్ వ్యూహకర్తగా భాగం కానున్నాడు. కేన్ మామ.. లక్నో ఫ్రాంచైజీలోకి స్వాగతం.
Cool. Calm. Calculated. Kane Williamson is now part of our think tank as our Strategic Advisor. 🙌
Welcome to Lucknow, Kane Mama! 💙 pic.twitter.com/t5v9OGMqyU
— Lucknow Super Giants (@LucknowIPL) October 16, 2025
ఐపీఎల్‌తో విలియమ్సన్కు సుదీర్ఘ అనుబంధం ఉంది. పది సీజన్లు ..2015 నుంచి 2024 వరకూ ఈ కివీస్ స్టార్ ఆటగాడిగా, కెప్టెన్‌గా పలు ఫ్రాంచైజీల తరఫున చెలరేగిపోయాడు. తన సహజశైలిని పక్కనపెట్టేసి విధ్వంసక ఆటకు తెరతీసిన కేన్ మామ 2018లో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథిగా రాణించిన విలియమ్సన్ 735 పరుగులు సాధించాడు. 2023లో గుజరాత్ టైటాన్స్‌కు మారిన ఈ సొగసరి బ్యాటర్.. ఆరంభ మ్యాచ్‌లో గాయపడి టోర్నీకి దూరమయ్యాడు. అయితే.. పద్దెనిమిదో సీజన్ వేలంలో విలియమ్సన్‌ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.
Wishing Kane Williamson a very happy birthday 🧡
Revisit one of the finest edits of Kane mama by SRH #OrangeArmy #IPL2025 pic.twitter.com/7SARAfL6cf
— Sunrisers Army (@srhorangearmy) August 7, 2024
ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో పలువురు క్రికెటర్లు టీ20లకే జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు విలియమ్సన్. అతడిత పాటు మరో నలుగురు సూతం వద్దనుకున్నారు. అయితే.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు మాత్రం పలకలేదీ వెటరన్. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ సెలెక్షన్‌కు ఈ స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.