IPL 2025 : సొంత గడ్డపై లక్నోసూపర్ జెయింట్స్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(6), విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్(8)లు పెవిలియన్ చేరారు. ఓపెనర్ మిచెల్ మార్ష్(30), రిషభ్ పంత్(23)లు ధాటిగా ఆడుతున్నారు. ఈ సీజన్లో పెద్దగా రాణించని పంత్.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. దాంతో, లక్నో 9 ఓవర్లకు
2 వికెట్ల నష్టానికి 68 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన లక్నోకు ఖలీల్ అహ్మద్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(6) కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి క్యాచ్ అందుకోవడంతో 6 పరుగులకే తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే డేంజరస్ నికోలస్ పూరన్(8) ను అన్షుల్ కంబోజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్ సాధించింది సీఎస్కే. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(23).. జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో పంత్ రివర్స్ స్కూప్‌తో సిక్సర్ సాధించాడు. లక్నో స్కోర్ 50 దాటింది.
#CSK continue to build pressure 💛
Captain Rishabh Pant joins Mitchell Marsh in the middle 🤝#LSG 42/2 after 6 overs.
Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK pic.twitter.com/2T3iJoqghC
— IndianPremierLeague (@IPL) April 14, 2025