IPL 2026 : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే కేన్ విలియమ్సన్ (Kane Williamson)ను వ్యూహాత్మక సలహాదారుగా తీసుకున్న లక్నో యాజమాన్యం ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి పెద్ద బాధ్యతలు అప్పగించనుంది. కోచ్‌గా సుదీర్ఘ అనుభవం కలిగిన వెటరన్ అయిన టామ్ మూడీ (Tom Moody)ని తమ ఫ్రాంచైజీ ‘గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా నియమించనుంది లక్నో. అయితే.. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోచ్‌గానూ పనిచేసిన టామ్ మూడీని లక్నో గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించుకుంటే అతడు ఇకపై సిస్టర్ ఫ్రాంఛైజీల వ్యవహారాలను చూసుకోనున్నాడు. అంటే.. ఐపీఎల్‌తో పాటు ఎస్ఏ20లోని లక్నో సూపర్ జెయింట్స్, ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఫ్రాంచైజీ కూర్పు, ఆటగాళ్ల ఎంపిక వంటివి మూడీ కనుసన్నల్లోనే జరుగనున్నాయి.
Lucknow Super Giants are set to appoint Tom Moody as their global director of cricket.
Moody will oversee Lucknow Super Giants in the IPL, Durban’s Super Giants in SA20 as well as their newly-acquired Manchester franchise in the Hundred
Details: https://t.co/nEeMjxf52t pic.twitter.com/vknsQoGr7u
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2025
పొట్టి క్రికెట్లో టామ్ మూడీ ట్రాక్ రికార్డు గొప్పగా ఉంది. ఈమధ్యే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఓవల్ ఇన్విసిబుల్స్ జట్టును మూడోసారి విజేతగా నిలిపాడు. అలానే ఇంటర్నేషనల్ 20లీగ్‌లో డెజర్ట్ వైపర్స్‌ను రెండుసార్లు ఫైనల్ చేర్చాడీ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్. తమ ఫ్రాంచైజీ కప్ కల నెరవేరుస్తాడని లక్నో యాజమాన్యం ఆశిస్తోంది. డిసెంబర్లో జరుగబోయే ఐపీఎల్ వేలానికి ముందే మూడీ టీమ్‌తో కలిసే అవకాశముంది. పంతొమ్మిదో సీజన్లో అతడు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, వ్యూహాత్మక సలహాదారు విలియమ్సన్తో కలిసి లక్నో గెలుపు ప్రణాళికలు రచించనున్నాడు.
🚨 REPORTS 🚨
Lucknow Super Giants are likely to appoint Tom Moody as their Global Director of Cricket. 🏏#Cricket #TomMoody #LSG #Sportskeeda pic.twitter.com/c0P9N98nM5
— Sportskeeda (@Sportskeeda) November 3, 2025
ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. వరుసగా రెండుసీజన్లు ప్లే ఆఫ్స్ చేరిన ఎల్ఎస్జీ.. 17, 18వ సీజన్లలో నాకౌట్ దశకు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పద్దెనిమిదో సీజన్ వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో.. అశించిన ఫలితాన్ని మాత్రం చూడలేదు. పంత్ సారథ్యంలోని ఆ జట్టు మొదట విజయాలతో అదరగొట్టింది. కానీ, చివరకు ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరలేదు.