Lovlina Borgohain | టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. తన కోచ్‌లను మారిస్తూ బ్యాడింటన్ ఫెడరేషన్ అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అసోంకు చెందిన లవ్లీనా ప్రస్తుతం బర్మింగ్‌హోమ్‌లో జరుగబోయే కామన్వెల్త్ క్రీడల కోసం సిద్ధమవుతున్నది. తాను పతకాలు సాధించడంలో సహకరించిన తన కోచ్‌లలో ఒకరికి కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో ప్రవేశం లభించలేదని, రెండోకోచ్ను ఇంటికి పంపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఎంత అభ్యర్థించినా మానసిక వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కోచ్‌లను మారుస్తూ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం క్రీడలపై ఎలా దృష్టి పెట్టాలో అర్థం కావడం లేదని పేర్కొందని పేర్కొంది. తన కోచ్‌లను తిరిగి నియమించాలని కోరింది. గత జూన్‌లో ఢిల్లీలో బీఎఫ్ఐ కామన్వెల్త్లో పాల్గొనేందుకు నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ 70 కిలోల విభాగంలో రైల్వేస్ పూజపై 7-0తో లవ్లీనా విజయం సాధించి బెర్తును ఖరారు చేసుకున్నది. టోక్యో-2020లో మహిళల 69 కిలోల కాంస్య పతకాన్ని గెలుచుకున్న లవ్లీనా చరిత్ర సృష్టించింది. విజేందర్ సింగ్ (బీజింగ్ 2008లో కాంస్యం), మేరీ కోమ్ (లండన్ 2012లో కాంస్యం) తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మూడవ భారతీయ బాక్సర్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. బర్మింగ్‌హోమ్ కామన్వెల్త్ క్రీడలు ఈ నెల 28న ప్రారంభమై.. ఆగస్ట్ 8న ముగియనున్నాయి.
— Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022