ఢిల్లీ : బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ 2026 టోర్నీలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ బోణీ కొట్టింది. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల 75 కిలోల తొలి రౌండ్ బౌట్లో లవ్లీనా.. 5:0తో ఉక్రెయిన్ బాక్సర్ ఒల్హాపై ఏకపక్ష విజయం సాధించింది.
ఆమెతో పాటు మంజు రాణి (48 కి.), నీతూ (51 కి.), కుసుమ్ (51 కి.), అరుంధతి (70 కి.) విజయాలు సాధించారు.