Lovlina Borgohain | ఢిల్లీ: చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన గ్రాండ్ ప్రిక్స్ 2024 బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గొహెయిన్ రజత పతకం సాధించింది. శనివారం ముగిసిన ఫైనల్ బౌట్లో లవ్లీనా.. 2-3తో చైనా బాక్సర్ లి కియాన్ చేతిలో పోరాడి ఓడింది.
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఇలాంటి పోటీల్లో పాల్గొని పతకం సాధించడం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రజతం నెగ్గిన తర్వాత విడుదల చేసిన వీడియోలో లవ్లీనా పేర్కొంది.