హైదరాబాద్, ఆట ప్రతినిధి : మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు సత్తాచాటారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), తెలంగాణ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన క్వార్టర్స్ పోరులో 48-51 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్..
5-0తో కల్పన (సాయ్ నార్త్)పై అలవోక విజయం సాధించింది. 57-60 కిలోల విభాగంలో నిహారిక.. 5-0తో ప్రియాంక (చండీగఢ్)ను మట్టికరిపించింది. 60-65 కిలోల కేటగిరీలో యశి శర్మ.. 3-2తో సరితా భాయ్ (ఉత్తరప్రదేశ్)పై గెలిచి సెమీస్కు అర్హత సాధించింది. ఒలింపియన్ లవ్లీనా బోర్గొహెయిన్.. 70-75 కిలోల విభాగంలో పంజాబ్ బాక్సర్ క్రిష్ వర్మపై గెలిచి సెమీస్ చేరింది.