పటియాలా: ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు గాను స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ బెర్తును దక్కించుకుంది. ఆమెతో పాటు సాక్షి చౌదరి, జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ సైతం మెగా టోర్నీలకు తమ స్థానాలను ఖాయం చేసుకున్నారు. పటియాలాలో జరుగుతున్న సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా మహిళల 75 కిలోల ఫైనల్లో లవ్లీనా.. 5-0తో సనమచ చానును చిత్తుచేయగా 48 కిలోల క్యాటగిరీలో సాక్షి.. 5-0తో వరల్డ్ చాంపియన్ మీనాక్షి హుడాకు షాకిచ్చింది.
పురుషుల 55 కిలోల ఫైనల్లో జాదుమణి.. 5-0తో నిఖిలపై ఏకపక్ష విజయం సాధించాడు. శుక్రవారంతో ముగిసిన సెలక్షన్ ట్రయల్స్ తర్వాత మహిళల విభాగం నుంచి లవ్లీనా, ప్రీతి పవార్ (54 కి.), జైస్మీన్ లంబూరియా (57 కి.- కామన్వెల్త్ క్రీడలకు మాత్రమే), ప్రియా (60 కి.), ప్రవీణ్ హుడా (65 కి.), అరుంధతి చౌధరి (70 కి. కామన్వెల్త్) ఎంపికయ్యారు. పురుషుల క్యాటగిరీలో జాదుమణి, సచిన్ సివాచ్ (60 కి.), ఆదిత్య ప్రతాప్ (65 కి. కామన్వెల్త్), సుమిత్ (70 కి.), అంకుష్ (80 కి.), కపిల్ (90 కి.), నరేందర్ (+90 కి.) ఉన్నారు.