ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను పసిడి పతకంతో మొదలైన భారత జైత్రయాత్ర తిరుగులేకుండా సాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 109కిలోల విభాగంలోయువ లిఫ్టర్ సరికొత్త జాతీయ రికార్డుతో కాంస్య పతకం ఒడిసిపట్టుకున్నాడు. అమృత్‌సర్‌కు చెందిన లవ్‌ప్రీత్ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన(355కి)తో పాటు క్లీన్ అండ్ జెర్క్‌లో కొత్త జాతీయ రికార్డు(192కి) నెలకొల్పాడు.