Virat Kohli : ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మూమాలుగా ఉండదు. ఈ స్టార్ క్రికెటర్ ఎక్కడ కనిపించినా అభిమానులు చుట్టుముట్టేసి సెల్ఫీల కోvirసం ఎగబడుతారు. అలాంటిది ద్వైపాక్షిక సిరీస్ కోసం ఏ దేశమైనా వెళ్లాడనకుకో.. విరాట్ ఆట చూసేందుకు స్టేడియాలకు పోటెత్తుతారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి ప్రవాస భారతీయులు, స్థానికులు వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తొలిసారి భారత జెర్సీ వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఆటగాడు కెరీర్లో చివరిసారి ఆస్ట్రేలియా పర్యనటలో ఆడబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం తొలి మ్యాచ్ సన్నద్ధతలో ఉన్న విరాట్ అక్కడ తన మేనియా చూపిస్తన్నాడు. పెర్త్ వన్డే కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
Cricket’s most prized possession right now: A Virat Kohli autograph ✍️ pic.twitter.com/BE3v3AQXhv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2025
పెర్త్ స్టేడియానికి శనివారం భారీగా చేరుకున్న ఫ్యాన్స్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడ్డారు. మాకు ఆటోగ్రాఫ్ ప్లీజ్.. మాకు ఓ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని తమ అభిమాన ఆటిగాడి సంతకాన్ని సాధించారు. వారు తనపై చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయిన కోహ్లీ.. ఏమాత్రం మొహమాటపడకుండా ఆటోగ్రాఫ్స్ ఇచ్చి అందరినీ ఖుషీ చేశాడు. ప్రస్తుతం క్రికెట్లో అభిమానులు అత్యంత విలువైనదిగా భావించేంది కోహ్లీ సంతకమే మరి. అందుకే.. తమ దేశానికి వచ్చిన అతడితో ఫొటోలు దిగడం కోసం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.