బెంగుళూరు: న్యూజిలాండ్‌తో బెంగుళూరులో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా(Team India) 31.2 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు టీమిండియా స్వదేశీ గడ్డపై 293 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. దాంట్లో ఇవాళే అత్యల్ప స్కోరు నమోదు అయ్యింది. పేస్ బౌలర్లతో న్యూజిలాండ్ అటాక్ చేయడంతో.. రోహిత్ సేన కుప్పకూలిపోయింది. అయిదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. స్వదేశీ గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో 50 పరుగులు స్కోర్‌ను కూడా దాటకపోవడం ఇదే మొదటిసారి.
కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అయిదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం ఇది రెండోసారి. 1999లో మొహాలీలో జరిగిన టెస్టులోనూ అయిదుగురు భారత బ్యాటర్లు డకౌట్ అయ్యారు. గతంలో 37 ఏళ్ల క్రితం భారత్ అత్యల్ప స్కోరుకే ఆలౌటైంది. 1987లో ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇండియా చాలా తక్కువ రన్స్ చేసింది. నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో 36 పరుగులకే ఇండియా ఆలౌటైంది.
స్వదేశీ గడ్డపై అత్యల్ప స్కోర్లు ఇవే..
బెంగుళూరు(2024)లో కివీస్‌తో టెస్టులో 46 రన్స్‌కే ఆలౌట్
ఢిల్లీ(1987)లో వెస్టిండీస్‌తో 75 రన్స్‌కే ఆలౌట్
అహ్మాదాబాద్(2008)లో సౌతాఫ్రికాతో 76 రన్స్‌కే ఆలౌట్
మొహాలీలో కివీస్(1999)తో 83 రన్స్‌కే ఆలౌట్
ముంబైలో కివీస్(1965)పై 88 రన్స్‌కే ఆలౌట్
విదేశాల్లో అత్యల్ప స్కోర్లు ఇవే..
అడిలైడ్(2020)లో ఆస్ట్రేలియాపై 36 రన్స్‌కే ఆలౌట్
లార్డ్స్(1974)లో ఇంగ్లండ్‌పై 42కే ఆలౌట్
బ్రిస్బేన్(1947)లో ఆస్ట్రేలియాపై 58 ఆలౌట్
మాంచెస్టర్(1952)లో ఇంగ్లండ్‌తో 58 ఆలౌట్
డర్బన్(1996)లో సౌతాఫ్రికాపై 66 కే ఆలౌట్