న్యూయార్క్: సస్పెన్స్ వీడింది. ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా జట్టును ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సి(Lionel Messi) ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని జాతీయ కోచ్ లియోనిల్ స్కాలోని ప్రకటించారు. అయితే రాబోయే వరల్డ్‌కప్‌లో ఆడేది అనుమానంగా ఉన్నట్లు ఇటీవల మెస్సి ప్రకటించాడు. కానీ ఆ సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ జాతీయ కోచ్ కీలక ప్రకటన చేశారు. దీంతో రికార్డు స్థాయిలో మెస్సి ఆరోసారి వరల్డ్‌కప్ ఆడనున్నాడు. 8 సార్లు బాలన్ డోర్ అవార్డు గెలిచిన మెస్సికే సారధ్య బాధ్యతలను అప్పగించారు.
ఖతార్‌లో నాలుగేళ్ల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే అర్జెంటీనా జట్టులో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ఫ్రాంకో మస్తానటునో పేరు లేదు. జూన్ 11వ తేదీ నుంచి వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ జరగనున్నది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. కన్సాస్ సిటీలో జరిగే తన తొలి మ్యాచ్‌లో అల్జీరియాతో అర్జెంటీనా ఢీకొననున్నది.
ఆటగాళ్ల వివరాలు..
గోల్‌కీపర్స్: ఎమిలియానో మార్టినేజ్, జిరోనిమా రుల్లి, జువాన్ ముసో
డిఫెండర్స్: గొంజాలో మాంటిల్, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్, నికోలస్ ఒటమెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫకుండా మెదీనా, నికోలస్ తగ్లియాఫికో
మిడ్‌ఫీల్డర్లు: లియాండ్రో పరేడ్స్, రోడ్రిగో డీ పాల్, ఎక్స్కుయల్ పాలేసియస్, ఎంజో ఫెర్నాండేజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కో
అటాకర్స్: లియోనిల్ మెస్సి, నికోలస్ పాజ్, థియాగో అల్మడా, నికోలస్ గొంజాలెజ్, జులియన్ అల్వరేజ్, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్, జోస్ మాన్యువెల్ లోపేజ్