అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీపై ఉన్న అభిమానం ఏంటో మరోమారు రుజువైంది. మెస్సీ పుట్టినగడ్డ రోసారియోలో ఓ బిల్డింగ్పై 69 మీటర్ల ఎత్తులో ఈ స్టార్ స్ట్రైకర్ గ్రాఫీటీ ఆవిష్కృతమైంది. స్థానిక ఆర్టిస్ట్ మార్లిన్ జురిగా.. మెస్సీ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. అర్జెంటీనా జెర్సీలో మెస్సీ తన గుండెపై చేయి వేసుకున్న
ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటున్నది.