Lionel Messi | అర్జెంటీనా స్టార్, ఫుట్‌బాల్ దిగ్గజం లియెనెల్ మెస్సికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ తర్వాత ఈ ఫుట్‌బాల్ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ నెల 18న లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సి రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు 35 ఏళ్ల మెస్సి వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది.
ప్రపంచకప్ అనంతరం అభిమానులు మెస్సి వెంటపడుతున్నారు. అతను ఎక్కడ కనిపించినా చుట్టుముట్టి సెల్ఫీలు, ఫొటోలకు ఎగబడుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెస్సి తన హోమ్టౌన్ రోసరోయ్ (Rosario) లో కుటుంబసభ్యులతో కలిసి ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పార్టీకి వెళ్లిన మెస్సి అక్కడ అభిమానుల కంట పడ్డాడు. అంతే ఇంకేముంది వందలాది మంది అభిమానులు మెస్సి కారును చుట్టుముట్టి కదలకుండా చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
El que anda tranquilo por Rosario es Lionel Messi 😅
NUESTRO CAMPEÓN DEL MUNDO 😍🇦🇷🏆 pic.twitter.com/jJuC2ToeZ1
— TNT Sports Argentina (@TNTSportsAR) December 28, 2022