న్యూఢిల్లీ: సమకాలీన ఫుట్‌బాల్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా సంచలనం లియోనెల్ మెస్సీ మధ్య రికార్డులు తరచూ చేతులు మారుతూనే ఉంటాయి. ఒకరు సెట్ చేసిన రికార్డు మరొకరు బీట్ చేయడం జరుగుతూనే ఉంటుంది. తాజాగా అలాంటిదే రొనాల్డో సెట్ చేసిన ఫ్రీకిక్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. కోపా అమెరికా కప్‌లో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మూడు గోల్స్ చేయగా.. అన్నింట్లోనూ మెస్సీ భాగస్వామ్యం ఉండటం విశేషం. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి అర్జెంటీనా లీడ్‌ను 3-0కు పెంచాడు.
ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును అతడు అధిగమించాడు. ఫ్రీకిక్‌తో మెస్సీ చేసిన 58వ గోల్ ఇది. ఫ్రీకిక్ గోల్స్‌లో రొనాల్డోను వెనక్కి నెట్టి మెస్సీ టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. ఇక మెస్సీకిది అర్జెంటీనా తరఫున 76వ గోల్. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన సౌత్ అమెరికన్‌గా పీలే సరసన నిలవడానికి ఒక గోల్ దూరంలో మెస్సీ ఉన్నాడు.
#CopaAmérica 🏆
— Copa América (@CopaAmerica) July 4, 2021
¡Bombazo! Lionel Messi la clavó de tiro libre para el 3-0 final de @Argentina sobre @LaTri
🇦🇷 Argentina 🆚 Ecuador 🇪🇨#VibraElContinente #VibraOContinente pic.twitter.com/FcvQrHuRka